గీతం అంతర్జాతీయ గ్రీన్ ఏఐ-2025 సదస్సులో పిలుపునిచ్చిన వక్తలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతర్జాతీయ సహకారం అవసరమని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘గ్రీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్’ (గ్రీన్ ఏఐ-2025) అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాదులోని మహీంద్రా విశ్వవిద్యాలయ ఎమెరిటస్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ పూజారి, ఒడిశాలోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సచ్చిదానంద దేహూరి వంటి విద్యావేత్తలు ఈ సదస్సుకు శ్రీకారం చుట్టారు. సదస్సు సావనీర్ ను ఆవిష్కరించారు.
ప్రొఫెసర్ అరుణ్ ‘ఇంటర్ ప్రెటబుల్ క్లస్టరింగ్’పై లోతైన అవగాహన కల్పించేలా కీలకోపన్యాసం చేశారు. గ్రీన్ ఏఐ అభివృద్ధి చెందుతున్న రంగమని, ఇటువంటి ట్రెడింగ్ రంగంపై గీతం అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. స్థిరమైన కృత్రిమ మేధస్సు యొక్క ఔచిత్యాన్ని వివరిస్తూ, ఈ అభివృద్ధి చెందుతున్న రంగంలో అన్వేషించమని పరిశోధకులను ఆయన ప్రోత్సహించారు. ఈ సదస్సు ఏఐ, అధిక-పనితీరు గల కంప్యూటింగ్ లో కొత్త పరిశోధనా మార్గాలు, వినూత్న అంశాలతో స్ఫూర్తిస్తుందని ప్రొఫెసర్ అరుణ్ ఆశాభావం వ్యక్తపరిచారు.
దక్షిణ కొరియాలోని యోన్సే విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సంగ్-బే చో వర్చువల్ గా ‘డీప్ లెర్నింగ్ పై ఇటీవలి వినూత్న రచనలు: సాఫ్ట్ కంప్యూటింగ్ ల్యాబ్ యొక్క దృక్పథాల’పై కీలకోపన్యాసం చేశారు. స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో ఏఐ యొక్క అపారమైన సామర్థ్యాన్ని, నైతిక ఏఐ విస్తరణ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఏఐని ఉపయోగించుకోడంలో భారతదేశం, కొరియా మధ్య సహకారం ఎందుకు ఉండకూడదని ప్రొఫెసర్ సంగ్-బే ప్రశ్నించారు.
ప్రొఫెసర్ సచ్చిదానంద దేహూరి ‘మెషిన్ లెర్నింగ్ లో పరేటో ఫ్రంట్ ను వెలికితీయడం’పై ఉపన్యసిస్తూ, ఏఐ-ఆధారిత పరిష్కారాలలో ఆప్టిమైజేషన్ పద్ధతులపై విలువైన అంతర్దృష్టులను అందించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అధ్యక్షత వహించారు. సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా అతిథులను స్వాగతించి, సత్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా 262 పరిశోధనా పత్రాలు ఈ సదస్సులో సమర్పించారని, వాటిలో 40 పత్రాలు స్ప్రింగర్ ప్రచురణకు ఎంపికైనట్టు సదస్సు నిర్వాహకుడు డాక్టర్ శరత్ చంద్ర నాయక్ వెల్లడించారు. మరో రెండు పోస్టర్లను కూడా ఎంపిక చేశామన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…