పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి జిల్లా పటన్ చెరు రుద్రారం గణేష్ దేవస్థానంలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని ఆలయ ఈవో లావణ్య తెలిపారు ఆలయంలో కొత్తగా ముగ్గురు ధర్మకర్తలను ఎన్నుకుని, వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అదే విధంగా, హరి ప్రసాద్ రెడ్డిని ఏకగ్రీవంగా కొత్త చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అనంతరం తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్ ని, అభినందించారు. .ఈ సందర్భంగా ఆలయ ఈవో లావణ్య మాట్లాడుతూ నేడు జరగనున్న జాతర బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని , భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు ఆమె వివరించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా, స్వామివారికి ప్రతిరోజూ అభిషేకం, పల్లకి సేవలు నిర్వహిస్తున్నామని .జాతర రోజున ఉదయం స్వామివారికి అభిషేకం, హోమాలు, పల్లకి సేవ, లడ్డు వేలం పాట, మరియు ముఖ్యంగా రథోత్సవం వంటి కార్యక్రమాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈవో లావణ్య భక్తులను కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ఈశ్వర్,ధర్మకర్తల మండలి సభ్యులు, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ప్రభు, పిఎసిఎస్ చైర్మన్ పాండు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకన్న,గోపాల్,మధువరెడ్డి, లక్ష్మారెడ్డి,నర్సింహారెడ్డి,గ్రామ పెద్దలు,భక్తులు పాల్గొన్నారు.