సెయింట్ ఆంథోని విద్యార్థులకు గీతం ఆర్కిటెక్చర్ అధ్యాపకుల ఉద్బోధ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సృజనాత్మకతతోనే వాస్తుశిల్పులుగా రాణించగలరని, విభిన్న యోచనే ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను ఆధిరోహించడానికి దోహదపడుతుందని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్యాపకులు అభిప్రాయపడ్డారు. సెయింట్ ఆంథోనీ జూనియర్ కళాశాల విద్యార్థులు బుధవారం గీతంను సందర్శించారు. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఛార్జి డైరెక్టర్ బందన్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని అధ్యాపక బృందం అసిస్టెంట్ ప్రొఫెసర్లు స్నిగ్రా రాయ్, అభిషేక్ సింగ్ వారితో సమావేశమై, సృజనాత్మక ప్రాజెక్టుల యొక్క సమగ్ర అవలోకాన్ని ఆ విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పలు ఆకర్షణీయమైన ప్రదర్శనలను అందించి, నిర్మాణ విద్యలో గీతం వినూత్న విధానాలను ఆవిష్కరించారు. ఆ తరువాత, అంథోని విద్యార్థులు ఎగ్జిబిషన్ హాల్, మెటీరియల్ మ్యూజియంలను సందర్శించారు. చివరగా సెమినార్ హాలులో వారికి ఆర్కిటెక్చర్ విద్యపై మరింత అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం విద్య, సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించడంలో గీతం నిబద్ధతను తెలియజేయడమే గాక, భవిష్యత్తులో ఆర్కిటెక్చర్ విద్యను అభ్యసించాలని అనుకునేవారిని ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు మిశ్రా వివరించారు. తాము ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని విశ్వసిస్తామని, వారి ప్రతిభ, ఆకాంక్షలను పెంపొందించే వాతావరణాన్ని అందించడానికి అంకితభావంతో కృషిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.అర్కిటెక్చర్ విద్యలో అగ్రగామిగా గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పాత్రను, రేపటి వాస్తుశిల్పులను రూపొందించడంలో దాని అంకితభావాన్ని ఈ కార్యక్రమం నొక్కిచెప్పింది.