-పార్టీ శ్రేణులతో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం
మనవార్తలు ,బొల్లారం:
రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలో ఆమోదించడం చారిత్రాత్మకమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, బొల్లారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు బొల్లారం మున్సిపాలిటీలోని జ్యోతి థియేటర్ ముందు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటాలకు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం మాజీ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి మాట్లాడుతూ చట్టసభల్లో రిజర్వేషన్ ఆమోదించినందుకు బీసీలకు 42% రిజర్వేషన్ పెంపు కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా అభివర్ణించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోక్ సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గోపాలమ్మ , చంద్రయ్య , నరసింహ రాజు , నాయకులు గుండ్ల మహేందర్ రెడ్డి, సంపత్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి , రమణయ్య , రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ రాజు , చక్రపాణి , దీనానాద్ , శ్రీమన్నారాయణ , రాజారాం, మాజీ వార్డ్ సభ్యులు భాస్కర్ , నరేందర్ , ధర్మారావు , శ్రీనివాస్ , శ్రవణ్ , శ్యామ్, ధన్రాజ్ , నాగరాజు , జగన్ , దిగంబర్ , జయరాం పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…