మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి, ఆహార విధానాల గురించి వివరిస్తూ, చిరు ధాన్యాల విలువలను తెలియజేస్తూ ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మిల్లెట్స్ మీడియా పోర్టల్, www.millets.news మాదాపూర్ వెస్ట్ సైడ్ హోటల్ లో శనివారం రోజు ఔత్సాహిక వ్యాపార వేత్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా www.millets.news డైరెక్టర్ శ్రీనివాస్ శరకడం రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ ప్రోడక్ట్ ఉత్పత్తి దారులను ఉద్దేశించి మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజం మొత్తం మిల్లెట్స్ వైపు దృష్టి సారించిందని, మిల్లెట్స్ ఉత్పత్తి పెంపొందించేందుకు ఇదే మంచి సమయమని తెలిపారు. ప్రభుత్వం అందజేసే వివిధ పథకాల ద్వారా సబ్సిడీ లతో కూడిన రుణాలను ఔత్సాహికులు పొందవచ్చని తెలిపారు. www.millets.news ప్రతీ మండలానికి ఒక ఒక మిల్లెట్స్ రిసోర్స్ పర్సన్ ను నియమిస్తుందని అది వారికి వారి కెరీర్ కు మంచి దిశా నిర్ధేశం చేస్తుందని. ఆసక్తి ఉన్నవారు 8297 606 789 నెంబర్ ను కాంటాక్ట్ చెయ్యవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ జిల్లాల నుండి వచ్చిన ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉత్పత్తి దారులు, హోమ్ గార్డెన్ బిల్డ్ చేసుకొనే విత్తనాల సప్లై, ఆర్గానిక్ టూత్ బ్రష్ లు, ఆర్గానిక్ షాంపు లు మొదలుకొని పప్పులు ఇతర నిత్యావసరాల వస్తువులను ప్రదర్శించారు. టెక్నాలిజీ తో మొత్తం ఆర్గానిక్ పంటలను అభివృద్ధి చేసే ఆలోచన ను ఫుడ్ టెక్నాలిజీ నిపుణులు కిరణ్ గాదెల, ఆదిత్య, శివ కుమార్, యమున లు వివరించారు.

