డుమాంట్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభించిమ అనుపమ పరమేశ్వరన్

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ,హైదరాబాద్:

హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో డుమాంట్ ఐస్ క్రీమ్ స్టోర్‌ను ప్రముఖ తెలుగు నటి అనుపమ పరమేశ్వరన్  ప్రారంభించారు. డుమాంట్ దేశవ్యాప్తంగా 28 అవుట్‌లెట్‌లతో ఐస్ క్రీమ్ మార్కెట్‌లో ప్రసిద్ధ చెందిన ఈ బ్రాండ్ సేంద్రీయ పదార్థాలకు ప్రసిద్ధి చెందింది.అనంతరం అనుపమ మాట్లాడుతూ ఇక్కడి ఐస్‌క్రీం యొక్క నాణ్యత మరియు రుచి నాకు చాలా నచ్చిందని, గజర్ హల్వా ఫ్లేవర్ నిజంగా ఆహ్లాదకరంగా ఉందన్నారు.

ఐస్ క్రీం చాలా నాణ్యతగా, రుచికరంగా ఉందని తరచూ తాను ఈ ప్రదేశానికి తరచుగా ఇక్కడికి రావడానికి ఇష్టపడతానని అన్నారు. అనుపమ రాబోయే సినిమాలు బటర్‌ఫ్లై మరియు కార్తికేయ2 త్వరలో విడుదల కానున్నాయి.డుమాంట్‌ స్టోర్‌ యజమాని సుశ్రుత మాట్లాడుతూ ఐస్‌క్రీమ్‌ను తయారు చేయడానికి మేము అన్ని సహజ పదార్థాలను ఉపయోగిస్తామని, ఇది ఆరోగ్యకరమైన ఉత్పత్తిని చేస్తుందన్నారు. చాక్లెట్, ఓరియో, వనిల్లా, కాలా జామూన్ మరియు స్ట్రాబెర్రీ వంటి అన్ని రుచులు ఇక్కడ లభిస్తాయని, ఇక్కడ గజర్ హల్వా రుచి చాలా ప్రత్యేకమైనదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *