సృజనాత్మకతను ప్రదర్శించిన గీతం విద్యార్థులు

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థుల సృజనాత్మకత, పరిశోధన, విమర్శనాత్మక ఆలోచనా నెపుణ్యాలను ప్రదర్శించేలా ‘పోస్టర్ ఎగ్జిబిషన్’ను బుధవారం గీతం హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ నిర్వహించింది. డిజిటల్ హ్యుమానిటీస్ అంతర్ విభాగ స్వభావాన్ని, సమకాలీన సమాజంలో దాని ఔచిత్యాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన సాగింది. డెరైక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లెఫ్ట్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఏ నాలుగో సెమిస్టర్ విద్యార్థులు తమ పరిశోధనా ప్రాజెక్టులను గోడ పత్రికలుగా రూపొందించి, అందరి ముందు ప్రదర్శించారు. పత్రికలు, డిజిటల్ సమాచారం: సారూప్యం, మార్పు, భవిష్యత్తు; ఇన్ స్త్రాగామ్ ద్వారా వ్యక్తిత్వాల ఆవిష్కరణ: డిజిటల్ ప్రపంచంలో పిల్లల పెంపకం; క్రీడలు, నిరసనలు, మీడియా; కెమెరా వెనుక (భారత చలనచిత్ర పరిశ్రమలో మహిళలు); భవన నమూనాల రూపకల్పన, నిర్మాణాలపై క్షృత్రికు మేథ ప్రభావం: ఆర్థిక అసమానత ధోరణలు వంటి సలు సమాకాలీన అంశాలపై విద్యార్థులు పరిశోధించి, పోస్టర్ల రూపంలో వాటిని ప్రదర్శించారు. సాంకేతికత, సమాజం, సంస్కృతి విభజనలపై లోతెపై విశ్లేషణ చేశారు. ఆయా ప్రాజెక్టులు విమర్శనాత్మక విశ్లేషణ, సృజనాత్మకత వ్యక్తీకరణకు వేదికగా మారాయి. జీఎహెచ్ఎస్ డెరైక్టర్ సన్నీ గోస్మాన్ జోస్, పలువురు అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొని, పలు సందేహాల గురించి అడిగి నివృత్తి చేసుకున్నారు. వినూత్న ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు తమను తాము అన్వేషించడానికి, ఇతరులకు వ్యక్తీకరించడానికి జీఎహెచ్ఎస్ అవకాశం కల్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *