ఐటీ బెల్స్ ‘ పుస్తకాన్ని వెలువరించిన గీతం పూర్వ విద్యార్థి..

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్న గీతం విద్యార్థులు మరో మెట్టు పెకి ఎక్కేలా ప్రాంగణ నియామకాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి తోడ్పడే ‘ ఐటీ బెల్స్ ‘ పుస్తకాన్ని రచించి , వెలువరించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు . ఖమ్మం జిల్లాకు చెందిన మంకెన ఉదయ్ భాను గీతం విశాఖపట్నం ప్రాంగణంలో 2008-12 మధ్య బీటెక్ సీఎస్ఈ పూర్తిచేసి , ప్రాంగణ నియామకాలల్లో ఎంపికెటీసీఎస్లో చేరినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకనటలో పేర్కొన్నారు . ఆ కంపెనీలో ప్రతిభచాటి ఒక్కోమెట్టూ అధిగమిస్తూ రిక్రూటర్ స్థాయికి చేరిన ఆయన , కలిసొచ్చిన  కరోనా  లాక్ డౌన్ సమయాన్ని పది మంది తనలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఉపకరించేందుకు పూనుకున్నట్టు తెలియజేశారు .

ప్రస్తుతం అనేక భారతీయ ఐటీ కంపెనీలు జాతీయ అర్హతా పరీక్షలను ( ఎన్యూటీలు ) నిర్వహిస్తూ , బీటెక్ చివరి ఏడాది విద్యార్థులను ఎంపిక చేస్తున్నాయని , అయితే , సరైన మార్గదర్శనం లేక గ్రామీణ విద్యార్థులు ఈ సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నట్టు భాను గ్రహించినట్టు పేర్కొన్నారు . ఈ లోటును పూరించడంలో భాగంగా , తన పదేళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుభవంతో , తనకున్న ఫ్రెషర్ రిక్రూట్మెంట్ నెపుణ్యాలను రంగరించి , ప్రాంగణంలో ఉండగానే ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఐటీ ఉద్యోగం సంపాదించే మార్గదర్శనంతో ‘ ఐటీ బెల్స్’ను వెలువరించినట్టు వివరించారు . ఐటీ పరిశ్రమలో ప్రవేశించాలని అభిలషించే విద్యార్థులకు ఇదో సువర్ణావకాశంగా ఆయన అభిప్రాయపడ్డట్టు తెలిపారు .

విద్యార్థులు ఇంటర్వ్యూ దశకు చేరుకునే వరకు ప్రిపరేషన్ ప్లాన్ను రూపొందించడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుందన్నారు . కానీ , ఇంటర్వ్యూ పూర్తి భిన్నమైనదని , అసలెన ఇంటర్వ్యూ వాతావరణంలో విద్యార్థులను నిమగ్నం చేయడానికి , వాస్తవ ప్రపంచ ఇంటర్వ్యూ వీడియోలు , వీక్లీ ఇండస్ట్రీ హ్యాంగవుట్లు , గ్రూప్ కోచింగ్ సెషన్లు , వ్యక్తిగత మార్గదర్శక ప్రోగ్రామ్ల వంటి వంద శాతం అనుభవపూర్వ అభ్యాసాలతో కూడిన పాఠ్యాంశాలను ఉదయ్ భాను అభివృద్ధి చేసినట్టు ఆ ప్రకటనలో వివరించారు . ఈ పుస్తకం అర్హత ఉన్న ఇంజనీర్లను ఉద్యోగం సాధించగల సత్తా ఉన్న ఇంజనీర్లుగా తీర్చిదిద్దడంలో తోడ్పడగలదనే భరోసాను వెలిబుచ్చారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *