పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని బి.అన్నా తనూజ సఫాలాను డాక్టరేట్ వరించింది. ‘బయోమా క్రోమోలిక్యూల్స్ బెంజిమిడాజోల్ కంజెనర్ల సరస్పర చర్యపై సమగ్ర క్రోమోలిక్యూల్స్ తో, సిద్ధాంతక అధ్యయనం’ చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు. మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బిజయ్ కేతన్ సాహు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయనం, ప్రయోగాత్మక పద్ధతులను ఉపయోగిస్తూ, పరస్పర చర్యల థర్మోడైనమిక్స్, జీవ పరమాణు నిర్మాణంపై ఉత్పన్నాల ప్రభావాన్ని విశ్లేషించింది. సమగ్ర పరిశోధన పని పరమాణు పరస్పర చర్యలపై మన అవగాహనను పెంపొందించడమే గాక, హేతుబద్ధమైన ఔషధ రూపకల్పన, ఔషధ సరఫరా వ్యవస్థల అభివృద్ధికి లోతైన అవగాహనను కల్పించిందన్నారు. అన్నా తనూజ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మోతహర్ రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.