పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అమెరికా (న్యూయార్క్) లోని సైజెన్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ లో ఓ నెలన్నర రోజుల పాటు పరిశోధనలు చేపట్టేందుకు గాను హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న డాక్టర్ నరేష్ కుమార్ కటారి వెళ్లారు. ఈనెల 15 నుంచి మే 30వ తేదీ వరకు, 46 రోజుల పాటు ఆయన న్యూయార్క్ పరిశోధనలు చేపట్టనున్నట్టు స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ఇన్ఫార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.రాజా మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గీతం, సైజెన్ ఫార్మాస్యూటికల్స్ మధ్య విద్యా- పరిశ్రమ సహకారాన్ని అభివృద్ధి చేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలిపారు. తన సందర్శన సమయంలో డాక్టర్ కటారి 1- ఆప్టిమల్ మిక్స్బర్ డిజైన్ తో ఎల్ సి అండ్ ఎంఎస్ ని ఉపయోగించి ట్రేస్-లెవల్ మ్యూటాజెన్స్, ఎన్ డీ ఎస్ఆర్ తో కూడిన కోహో ర్డ్ యొక్క సంశ్లేషణ, పరిమాణాన్ని అములు. చేయడంపై దృష్టిసారిస్తారన్నారు. అంతేగాక, ఎల్ సీ / ఎలిసీ- ఎంఎస్ పద్ధతులు, ఓబీడీ ప్రోటోకాల్ ను ఉపయోగించి, పూర్తయిన మోతాదు రూపాల్లో క్షీణత మలినాలను, ప్రక్రియ సంబంధిత మలినాలను, విషపూరిత మలినాలను, జెనోటాక్సిక్ మలినాలను గుర్తించడానికి క్షీణత మెకానిజం మార్గాన్ని గుర్తించడం, అన్వేషించడం చేస్తారని వివరించారు.పరిశోధనల కోసం డాక్టర్ కటారి అమెరికాకు మరోమారు వెళ్లడంపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…