అంతర్జాతీయ సదస్సులో వక్తగా గీతం ప్రొఫెసర్…

Hyderabad Telangana

పటాన్ చెరు:

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ , హెదరాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సినోయ్ సుగుణనక్కు ఓ అరుదైన గౌరవం దక్కింది . వర్చువల్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్వర్క్ ఇనిషియేటివ్ ( ఐఆర్ఎస్ఐ ) , ఫార్మాస్యూటికల్ సెన్స్డ్స్పె అంతర్జాతీయ స్నాతకోత్తర సదస్సు -2021 లో వక్తగా పాల్గొనేందుకు సినోయ్ను ఆహ్వానించినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు .

పరిశోధనా సహకారం , ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించేందుకు గాను మలేసియాలోని యూఐటీఎం గీతం , హెదరాబాద్ ల మధ్య 2019 లో కుదిరిన అవగాహనా ఒప్పందంలో భాగంగా ఇది సాకరమైనట్టు తెలిపారు . మలేసియాలోని అంతర్జాతీయ వైద్య విశ్వవిద్యాలయం , జపాన్లోని టోక్యో విశ్వవిద్యాలయం , మలేసియాలోని యూఐటీఎంలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించినట్టు ఆయన వివరించారు . ఈ కార్యక్రమంలో మనదేశం నుంచి దాదాపు 300 మంది ప్రతినిధులు , మలేసియా , థాయ్లాండ్ , ఫిలిప్పీన్స్ , యూఏఈ తదితర దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నట్టు ఆయన తెలియజేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *