గీతం బీ – స్కూల్లో అంతర్జాతీయ సదస్సు…

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ‘ అనిశ్చితి సమయంలో సుస్థిరత , వినూత్న నిర్వహణ పద్ధతులు ‘ అనే అంశంపై డిసెంబర్ 3-4 తేదీలలో రెండు రోజులు అంతర్జాతీయ వర్చువల్ సదస్సును నిర్వహించనున్నారు . ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకులు ప్రొఫెసర్ ఆర్.రాధిక , ప్రొఫెసర్ ఎం.జయశ్రీలు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . కోవిడ్ -19 ద్వారా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి సంస్థలు అనుసరించిన వినూత్న నిర్వహణ పద్ధతులపై చర్చించడం , విద్యావేత్తలు , పరిశోధకులు , నిర్వహణ నిపుణులకు ఒక వేదికను అందించడం ఈ సదస్సు లక్ష్యమని తెలిపారు . ఇది మహమ్మారి , పునరుద్ధరణ వ్యూహాలను ఎదుర్కోవడానికి ఆలోచనలను పంచుకోవడానికి వీలు కల్పిస్తుందని , ప్రపంచ నలుమూలల నుంచి సదస్యులను ఆహ్వానిస్తోందన్నారు . పేర్ల నమోదు , తదితర వివరాల కోసం finghbscon21@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని వారు సూచించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *