పార్టీ పటిష్టతకు సైనికుల వలే కృషి చేయాలి
ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు
టిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు విద్యార్థి, యువజన విభాగాల నాయకులు సైనికుల వలె కృషిచేయాలని, కష్టపడే ప్రతి కార్యకర్త ను పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విద్యార్థి, యువజన విభాగాల నూతన కార్యవర్గాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు.

టిఆర్ఎస్ పార్టీలో విద్యార్థి, యువజన విభాగాల దే కీలక పాత్ర అన్నారు. కష్ట పడిన ప్రతి ఒక్కరికి తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రస్తుత సమాజంలో యువత మత్తుకు బానిస అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాలు అప్రమత్తంగా ఉండి, సంఘవిద్రోహ శక్తుల ఆట కట్టించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు వివరించాల్సిన గురుతర బాధ్యత ఈ రెండు విభాగాలపై ఉందన్నారు.

నియోజకవర్గ స్థాయిలో క్రీడారంగానికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు, నూతన స్టేడియాలు నిర్మించబోతున్నట్లు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నియోజకవర్గ స్థాయి యువజన విభాగం అధ్యక్షులు గా శ్యాంసుందర్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా చెన్నారెడ్డి లు ఎన్నికయ్యారు. అనంతరం నియోజకవర్గలోని నాలుగు మండలాలు, మూడు మున్సిపాలిటీలు, మూడు డివిజన్ల నూతన కార్యవర్గలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, సోమిరెడ్డి, విజయ్ కుమార్, గూడెం విక్రమ్ రెడ్డి, మెరజ్ ఖాన్, కృష్ణ కాంత్, తదితరులు పాల్గొన్నారు.
