అంతర్ విభాగ శోధనకు ప్రాధాన్యం

Telangana

నైపుణ్యోపన్యాసంలో స్పష్టీకరించిన

జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ ప్రొఫెసర్ కౌసిక్ సర్కార్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అంతర్ విభాగ పరిశోధన(ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్)కు ప్రాధాన్యం పెరుగుతోందని, అత్యాధునిక పరిశోధనలు అందుకు ఊతం ఇస్తున్నాయని అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయ మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కౌసిక్ సర్కార్ అన్నారు.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రెండు అంశాల కథ: ఇమేజింగ్, థెరప్యూటిక్స్, టిష్యూ ఇంజనీరింగ్ కోసం బబుల్స్ (బుడగలు), విస్కోలాస్టిక్ మీడియంలో వినియోగం’ అనే అంశంపై మంగళవారం ఆయన నైఫుణ్యోపన్యాసం చేశారు. ఈ రంగంలో తాను చేస్తున్న బహుళ విభాగ పరిశోధనలను వివరిస్తూ, ఆరోగ్య పరిరక్షణ, అంతరిక్షం (ఏరోస్పేస్)లో ఇంజనీరింగ్ అప్లికేషన్లు, వాటి భవిష్యత్తు గురించి ఆసక్తిని పెంపొందించారు.అల్ట్రాసౌండ్-సహాయక ఎముక, మృదులాస్థి కణజాల ఇంజనీరింగ్ లో మైక్రోబబుల్, వాటి వినియోగాలను ప్రొఫెసర్ కౌసిక్ వివరించారు.

ముఖ్యంగా త్రీడీ-ప్రింటెడ్ పరంజాల సందర్భంలో, చికిత్సా విధానాలను విప్లవాత్మకంగా మార్చడానికి, రోగి ఫలితాలను మెరుగుపరచడానికి ఈ సాంకేతికతల సామర్థ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. నిర్దిష్ట క్లినికల్ ప్రయోజనాల కోసం బుడగలను రూపొందించడానికి ఇంజనీరింగ్ ను ఎలా ఉపయోగించవచ్చనే దానిపై డాక్టర్ సర్కార్ పలు అంతర్దృష్టులను, అంతర్ విభాగ స్వభావాన్ని నొక్కి చెప్పారు.తొలుత, గీతం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎండీ.అక్తర్ ఖాన్ అతిథిని స్వాగతించారు. ఏరోస్పేస్, మెకానికల్ ఇంజనీరింగ్ లోని అభివృద్ధి చెందుతున్న రంగాలలో ప్రొఫెసర్ కౌసిక్ పరిశోధన యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఏరోస్పేస్ ప్రొపల్షన్ సిస్టమ్స్ లో బబుల్ ఇమేజింగ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తోందని డాక్టర్ ఖాన్ పేర్కొన్నారు. ఈ నైపుణ్యోపన్యాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *