వాస్తుశిల్పికి సృజన అవశ్యం

Telangana

గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులకు ఐఐఐడీ నిపుణుల ఉద్బోధ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నిర్మాణ రూపకల్పన (ఆర్కిటెక్చరల్ డిజైన్)లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, ఆవిష్కరణలు అవశ్యమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియల్ డిజైనర్స్ (ఐఐఐడీ) నిపుణులు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్ విద్యార్థులు ఇటీవల లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్ లో ఐఐఐడీ నిర్వహించిన ఐత్రీ సిరీస్ ఐదవ ఎడిషన్ లో పాల్గొన్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థులు, అనుభవజ్జులైన నిపుణుల మధ్య వారధిగా ఈ కార్యక్రమం పనిచేయడమే గాక, వారి నుంచి నేర్చుకోవడానికి, నిపుణులతో కొంత సమయం గడపడానికి తోడ్పడింది.నవీన్ పానుగంటి. షమిలా మీరన్, అమిత్ షాలతో సహా పేరొందిన ఆర్కిటెక్ట్ లు తమ వృత్తిపరమైన ప్రయాణాలు, డిజైన్ మెళకువలను విద్యార్థులతో పంచుకున్నారు. తరువాతి తరం వాస్తుశిల్పులను ప్రేరేపించడం, విద్యావంతులను చేయడం యొక్క ప్రాముఖ్యతను వారు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలకు వారు వివరణాత్మక జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. అంతే కాక, గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులకు ఐఐఐడీ విద్యార్థి సభ్యత్వ ధృవీకరణ పత్రాలను ఇవ్వడం విశేషం. ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎదుగుదల.. రెండింటినీ ప్రోత్సహిస్తూ ఐఐఐడీ, గీతం ఆర్కిటెక్చర్ స్కూలు మధ్య కొనసాగుతున్న సహకారంలో ఇదో మైలురాయిగా నిలిచిపోనుంది. విద్యార్థులు, నిర్మాణ సంస్థల మధ్య సంబంధాలను పెంపొందించడంలో ఇది మరో విజయవంతమైన చొరవగా గుర్తించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *