మన వార్తలు ,పటాన్ చెరు:
ఆదాయ వనరుల కోసం ప్రభుత్వ భూములను అమ్మడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని 31 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని వేలం ద్వారా విక్రయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేాశారు. వెంటనే భూముల వేలాన్ని నిలిపివేయాలని లేదంటే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఆర్ సీపురంలో శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు పత్రికా, మీడియా సమావేశం మాట్లాడుతూఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ, అసైన్డ్, శిఖం, అటవీ, దేవాదాయ, భూదాన, వక్ఫ్, మిగులు భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం, ఉన్న భూములను కూడా అమ్మాలని నిర్ణయించడం సరికాదన్నారు.
అమీన్ పూర్ లోని 343 సర్వే నెంబర్ లోని 31 ఎకరాల భూమిని వేలం వేసేందుకు గత నెలలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ (TSIIC) ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారని గోదావరి అంజిెరెడ్డి గారు వెల్లడించారు. మార్చి 24 న ఆన్ లైన్ విధానంలో భూముల వేలం వేస్తున్నారని గజానికి 40 వేలుగా రిజర్వు ధర నిర్ణయించి.కనీసం 613 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని పొందాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆమె తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలను పట్టించుకోకుండా కేవలం ఖజానా నింపుకునేందుకు విలువైన భూములను అమ్మడాన్ని ఆమె తప్పుబట్టారు. అమీన్ పూర్ మండలంలో పోలీస్ స్టేషన్, మున్సిపాలిటీ, ప్రభుత్వ ఆస్పత్రి, తహశీల్దార్ , ఎంపీడీవో కార్యాలయం, జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలు, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు సరిపడా భూములు కేటాయించకుండా ఆదాయం కోసం భూములను ఎలా విక్రయిస్తారని గోదావరి అంజిరెడ్డి గారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
సరైన భవనాలు లేక అద్దె, ఇరుకు భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయని, వాటి నిర్మాణాలకు భూములు కేటాయించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు లేవని చెప్పే సర్కారు ఇప్పుడెలా భూములను అమ్ముతోందని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, నిరు పేదల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు 31 ఎకరాలను వెంటనే కేటాయించాలని కోరారు. ప్రభుత్వానికి ఆదాయం పైన ధ్యాస తప్ప నిరుపేదల సంక్షేమం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై లేదని విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని అమీన్ పూర్ భూముల వేలాన్ని నిలిపివేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆమె విమర్శించారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…