పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అంటరానితనాన్ని రూపుమాపి అన్ని వర్గాల సమానత్వం కోసం జాతిని జాగృతం చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని ఆయన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి ఆయన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించి, ప్రతి ఒక్కరికి సమానత్వం, సౌబ్రాతత్వం, రిజర్వేషన్లు అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే తలంపు తో రాజ్యాంగాన్ని రూపొందించాడని తెలిపారు, సమాజంలో సామాజిక అసమానతలు రూపుమాపితేనే అభివృద్ధి పథంలో పయనిస్తామని నమ్మి ఆనాడే రాజ్యాంగంలో బడుగు వర్గాలకు ప్రాధాన్యతనిచ్చిన అంబేద్కర్ గారి ఆశయ సాధనకు నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…