ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

politics Telangana

రామచంద్రపురం,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బిరం గూడ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ప్రశాంత్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.బీఎస్పీ రాష్ట్ర నాయకులు సతీష్ మాట్లాడుతూఅంబేద్కర్‌ బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోదుడన్నారు . ప్రభుత్వ ఫలాలందరికి చెందాలని, సామాజికంగా, ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికీ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు . విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహౌన్నత వ్యక్తి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అని వారు కొనియాడారు.

యువజన నాయకులు జి. నిరంజన్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడంతో పాటు, 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అంబేద్కర్ అందరివాడు కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడని , ఎంతకాలం బ్రతికామన్నది కాదని ప్రజలతో ఆదరణ పొందే విధంగా ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యమని ఆయన తెలిపారన్నారు. అంబేద్కర్ ను ఉన్నతంగా నిలిపి, సముచిత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో ఒక గొప్ప మహా వ్యక్తిగా నిలిచిపోతారని ,ఆత్మన్యూనతకు, దుర్భలత్వానికి గురయ్యే ఆలోచనల్లో కూరుకుపోకుండా, గొప్పగా ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వమానవుడు అంబేద్కర్ అని సమస్త వ్యవస్థల్లో సమాన హక్కులకోసం తన జీవితకాలం పరితపించిన ఆదర్శమూర్తి అంబేద్కర్  తెలిపారు.

ఈ కార్యక్రమంలో బొడ్డు వంశీకృష్ణ,కిరణ్ కుమార్, ఎడ్ల నవీన్, అనిల్ సింగ్, ముక్తవరం సాయి కిరణ్, పరంకుషం కృష్ణ ,ప్రణీత్, దెవన్ జాక్సన్, అంబేద్కర్ యూత్ సభ్యులు, భీమ్ యంగ్ స్టార్స్ పాల్గొని విజయవంతం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *