జిన్నారం,మనవార్తలు ప్రతినిధి :
జిన్నారం మండలం రాళ్లకత్వ తన సొంత నిధులతో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని చిట్కులు సర్పంచ్ నీలం మధు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం దేశంలోనే మొట్టమొదటి అని అన్నారు .దాంతో పాటు నిర్మించిన సెక్రటేరియట్ కు అంబేద్కర్ విగ్రహం నామకరణం చేయడం గొప్ప విషయం అన్నారు.అంబేద్కర్ అందరివాడు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చాటి చెప్పారన్నారు .కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడని , ఎంతకాలం బ్రతికామన్నది కాదని ప్రజలతో ఆదరణ పొందే విధంగా ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యమని ఆయన తెలిపారన్నారు. అంబేద్కర్ ను ఉన్నతంగా నిలిపి, సముచిత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో ఒక గొప్ప మహా వ్యక్తిగా నిలిచిపోతారని ఆయన తెలిపారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం నుంచి రాళ్లకత్వ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు,
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…