పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబాలని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో నిర్వహించిన మల్లన్న స్వామి జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామాలలో నిర్వహించే జాతరలు ఉత్సవాలతో, గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు గ్రామస్థుల మధ్య ఐక్యమత్యం వెల్లివిరుస్తుందని తెలిపారు.మన ఉత్సవాలను, జాతరాలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. మలన్న స్వామి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ఆ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జాతర నిర్వాహకులు, గ్రామ పెద్దలు, ప్రజలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు,