మనవార్తలు , శేరిలింగంపల్లి :
జి వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శివాలయం దగ్గర, ఇంద్ర హిల్స్, అల్విన్ కాలనీ, లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్, రామకృష్ణ తెలిపారు. ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ గజ్జల యోగానంద్ ప్రారంభిస్తారని ఆయన అన్నారు. ఈ వైద్య శిబిరం నందు బీపీ పరీక్ష, షుగర్ పరీక్ష, ఎస్ పి ఓ 2 పల్స్, జనరల్ పిజీషియాన్ కంటి పరీక్ష, సంబంధిత సమస్యలకు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిబిరం లో రక్తంలో షుగరు, బి.పి, గుండెకు సంబంధించిన ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించి వైద్య శిబిరం నందే గుండె వ్యాధులను నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలను ఉచితముగా నిర్వహంచి అవసరమైన వారికి ఉచితముగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరం నందు పేదలకు ఏదైనా వైద్యం కాని తక్షణ వైద్య సహాయం అవసరమైన వారికి అందిస్తామని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.