మనవార్తలు ,రామచంద్రపురం:
మానవ సేవే పరమావధిగా పని చేస్తున్న ఏకే స్వచ్ఛంద సంస్థ…మరోసారి తన ఉదారతను చాటుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద యువతికి అండగా నిలిచింది.తల్లిదండ్రులు లేని అనాధ యువతి వివాహానికి ఎకే ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందించింది. పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీకి చెందిన రుక్సానా బేగంకు తల్లిదండ్రులు లేరు. నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహం నిశ్చయం అయింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆడబిడ్డకు సాయం అందించిన ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ ను స్థానికులు అభినందించారు.