మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు నియోజకవర్గంలోని నూతన కాలనీలకు మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం పోచారం గ్రామ పరిధిలోని సన్ రైస్ కాలనీ లో మిషన్ భగీరథ పథకం ద్వారా ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఇంటింటికి రక్షిత మంచినీరు పైపులైనును గారు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి జగన్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

