Telangana

26న చిట్కుల్ లో 30 వేల మందితో ఐలమ్మ జయంతి వేడుకలు

రాష్ట్రంలోనే మొదటి కాంస్య విగ్రహావిష్కరణ

– రజక సంఘం జాతీయ కో ఆర్డినేటర్ కొల్లూరు మల్లేశ్ కుమార్

మనవార్తలు ,పటాన్ చెరు:

పటాన్ చెరు, నేటిదాత్రి: తెలంగాణ తల్లి, వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర మాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్య శాలి
చాకలి ఐలమ్మ అని, వీరనారి ఐలమ్మ జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని రజక సంఘం జాతీయ కో ఆర్డినేటర్ కొల్లూరు మల్లేశ్ కుమార్ తెలిపారు. చిట్కుల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులతో కలిసి కొల్లూరు మల్లేశ్ కుమార్ మాట్లాడారు. చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఈ నెల 26 న చిట్కుల్ గ్రామంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చిట్యాల ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ హాజరుకానున్నట్లు తెలిపారు. కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరించిన నీలం మధు ముదిరాజ్ కు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. రజక సంఘం సభ్యులతో పాటు బీసీ అన్ని వర్గాల ప్రజలు సుమారు 30 వేల మందితో ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ ఉంటుందన్నారు. రాజకీయాలకతీతంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రజకుల ఆత్మ గౌరవం పెంచేలా నీలం మధు ముదిరాజ్ ఐలమ్మ‌ జయంతి వేడుకలను నిర్వహించడం పట్ల రజక సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, సెక్రెటరీ జనరల్ కొలంపల్లి వెంకట్రాములు, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు నల్లతీగల రాజు, ఉపాధ్యక్షులు మహేష్, జీతయ్య, వెంకటేష్, నర్సింహా రావు, మల్లేశం, వెంకన్న  తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago