అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Lifestyle Telangana

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో సూచించిన ఆస్ట్రియాలోని ఏటీ&ఎస్ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అభివృద్ధి చెందుతున్న అధునాతన సాంకేతికతలను వర్ధమాన ఇంజనీర్లు అందిపుచ్చుకోవాలని ఆస్ట్రియాలోని ఏటీ అండ్ ఎస్ ఏజీలో అప్లికేషన్ ఇంజనీరింగ్ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ మొక్కపాటి సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘అధునాతన సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెక్నిక్స్’పై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. టూడీ, త్రీడీ, అభివృద్ధి చెందుతున్న ఫోర్ డీ ప్యాకేజింగ్ తో సహా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెక్నాలజీలలో తాజా పురోగతుల గురించి డాక్టర్ మొక్కపాటి విలువైన సమాచారాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. ఫోర్ డీ పరిజ్జానం లోని మడత లేదా వంపు ద్వారా అన్ని భాగాలకు విద్యుత్ కనెక్టివిటీని పెంచుతుందన్నారు.

బాల్ గ్రిడ్ అర్రే, చిప్ స్కేల్ ప్యాకేజీ, కోర్ లెస్ ప్యాకేజింగ్ వంటి ఆధునిక ప్యాకేజింగ్ నిర్మాణాలలో ఉపయోగించే అధునాతన బిల్డ్-అప్ మెటీరియల్ లకు పెరుగుతున్న డిమాండ్ ను ఆయన వివరించారు. ప్యాకేజింగ్ పనితీరును మెరుగుపరచడానికి ఫైన్ లైన్, స్పేస్, ఫైన్ వయా పిచ్, క్యూరింగ్, రీఫ్రో సమయంలో తక్కువ వార్ ఫేజ్, అధిక ఇన్సులేషన్ విశ్వసనీయత వంటి కీలక అంశాలను డాక్టర్ మొక్కపాటి వివరించారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, డాక్టర్ మొక్కపాటి అధునాతన ప్యాకేజింగ్, ఐసీ సబ్ స్ట్రేట్ లలో ఆవిష్కరణలను చర్చించారు. సెమీకండక్టర్ టెక్నాలజీలోని ప్రధాన ధోరణులపై కూడా ఆయన ప్రసంగించారు.

కీలకమైన సాంకేతికాంశాలు, సెమీకండక్టర్ తయారు చేసే ప్రముఖ పరిశ్రమలు, సెమీకండక్టర్ వాల్యూ చెయిన్ పై కృత్రిమ మేధస్సు ప్రభావం పెరగడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.ఈ ఉపన్యాసం హై-ఫెర్పార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్ పీసీ) వెనుక ఉన్న ఆర్కిటెక్చర్, భవిష్యత్ ఆవిష్కరణలను నడిపించే సెమీకండక్టర్ చిప్ లతో సహా ముఖ్యమైన పరిశ్రమ మార్పులను డాక్టర్ మొక్కపాటి వివరించారు. భారతదేశంలో విస్తరిస్తున్న సెమీకండక్టర్ తయారీ రంగంపై విలువైన సమాచారాన్ని అందించారు. మైక్రోన్, రెనెసాస్, స్టార్స్, కేన్స్ టెక్నాలజీ, టాటా-పీఎస్ఎంసీ, అదానీ-టవర్ సెమీకండక్టర్ వంటి కంపెనీల కీలక ప్రాజెక్టులను ఆయన ప్రస్తావించారు. విద్యార్థులను ప్రశ్నలడగమని ప్రోత్సహిస్తూ, వాటికి డాక్టర్ మొక్కపాటి సందర్భోచిత జవాబులిచ్చారు.ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి, కార్యక్రమ నిర్వాహకుడు ప్రొఫెసర్ ఎం.ప్రశాంత రెడ్డి అతిథిని సత్కరించి, ఆయన అమూల్యమైన సమయాన్ని గీతం విద్యార్థుల కోసం కేటాయించి, అధునాతన సాంకేతికతపై అవగాహన పెంచినందుకు కృతజ్జతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *