కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్..
పటాన్ చెరు:
గ్రామ పంచాయతీ స్థాయిలో ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలో ఎవరికైనా జ్వరం, కరోనా లక్షణాలు ఉంటే ఉచిత పరీక్ష కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉపేందర్, ఎంపిడిఓ బన్సిలాల్, ఎం పీ ఓ రాజు, ఎంపీటీసీ కుమార్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ యాదవ్, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది గీత, తదితరులు పాల్గొన్నారు.