కళాత్మకతకు సాంకేతికతను జోడించండి

Telangana

స్కెచింగ్ కార్యశాలలో ఆర్కిటెక్చర్ విద్యార్థులకు శిక్షకుల సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆర్కిటెక్చర్ విద్యార్థులలో నిబిడీక`తంగా ఉన్న కళాత్మకతకు సాంకేతికతను జోడిస్తే అటు ఖచ్చితత్వాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, ఇటు వారి సృజనాత్మక ఆలోచనలను మరింత పెంపొందించుకోవచ్చని శిక్షకురాలు సానియా షర్పున్నీసా అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో రెండు రోజుల స్కెచింగ్ కార్యశాలను నిర్వహించారు. ఆర్కిటెక్చరల్ డిజైన్ రంగంలో కీలకమైన దృక్పథం, షేడింగ్, నిష్పత్తులతో సహా అవసరమైన స్కెచింగ్ టెక్నిక్ లపై లోతైన అవగాహన ఈ వర్క్ షాప్ లో కల్పించారు.సాధారణమైన వాటిని సంక్లిష్టమైన, ఆకర్షణీయమైన స్కెచ్ లుగా మార్చడం, ప్రాదేశిక సంబంధాలను దృశ్యమానం చేయగల వారి సామర్థాన్ని, క్రియాత్మక, సౌందర్యపరంగా ఆహ్లాదకరమైన భవనాలను రూపొందించడంలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇందులో పాల్గొన్నవారు సాధన చేశారు. హాచింగ్, షేడింగ్ వంటి సాంకేతికతలను కూడా ఈ సందర్భంగా వారికి వివరించారు. ఈ కార్యశాలలో నిర్వహించిన ముఖాముఖిలో విద్యార్థుల మధ్య చిట్కాలు, సాంకేతికతల మార్పిడిని ప్రోత్సహించారు. కార్యశాల ముగిసే సమయానికి విద్యార్థులు తమ డ్రాయింగ్ లో ఖచ్చితత్వాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, వారి సృజనాత్మక ఆలోచనలను మెరుగుపరచుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *