మనవార్తలు ,హైదరాబాద్:
సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న జంటలకు హిరా ఫెర్టిలిటీ సెంటర్ చక్కటి పరిష్కారం అందిస్తుందని టాలీవుడ్ సినీనటి ఫరియా అబ్దుల్లా అన్నారు .హైదరాబాద్ టోలీచౌకిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ టెన్షన్, హిరా ఫెర్టిలిటీ సెంటర్ ను ఆమె ప్రారంభించారు. ఐవీఎఫ్ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నటి ఫరియా అన్నారు. హిరా ఫెర్టిలిటీ సెంటర్ ఫౌండర్ డాక్టర్ ఫజలున్నీసా మాట్లాడుతూ అత్యాధునిక మౌలిక సదుపాయాలు , అనుభవజ్ఞులైన నిపుణుల బృందంతో కూడిన హిరా ఫెర్టిలిటీ సెంటర్ లో ఐవీఎఫ్ , ఐయూఐ , సంతానోత్పత్తి సంరక్షణ , సమగ్ర సంతానోత్పత్తి సేవలను అందిస్తున్నామన్నారు. జంటలకు తక్కువ ఖర్చుతో ఐవీఎఫ్ చికిత్సలు అందిస్తున్నామన్నారు.