జ్ఞానేంద్ర ప్రసాద్ లేకపోవడం పార్టీకి తీరని లోటు – జయంతి సంస్మరణ సభలో బీజేపీ నేతలు.

Hyderabad politics Telangana

శేరిలింగంపల్లి:, మనవార్తలు :

శేరిలింగంపల్లి నియోజకవర్గం సుపరిచితులు సంఘ సేవకులు ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి ప్రజల మనిషి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కీర్తిశేషులు జ్ఞానేంద్ర ప్రసాద్ లేని లోటు పార్టీ కి తీరని లోటని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడ్డారు. ఆయన జయంతి సందర్భంగా హఫీజ్ పెట్ మరియు మియపూర్ డివిజన్ సంయుక్తంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్,మియపూర్ మమత ఎస్టేట్స్ వద్ద జ్ఞానేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి తదనంతరం సంస్మరణ సభ మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, క అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సీనియర్ నాయకులు కశిరెడ్డి భాస్కర్ రెడ్డి, మొవ్వా సత్యనారాయణ, నాగేశ్వర్ గౌడ్, బుచ్చిరెడ్డి, శేరిలింగంపల్లి ఇన్చార్జి గజ్జల యోగానంధ్, హరి భూషణ్ రెడ్డి మియాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి రాఘవేంద్రరావు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, కాంటెస్టెడ్ కార్పోరేటర్ సింధు రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు మాణిక్ రావు హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు కుమ్మరి జితేందర్, నాయకులు అనిల్ కుమార్ గౌడ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, నాయిని రత్నకుమార్, నవీన్, మన్నే సురేష్ ముదిరాజ్ కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *