ఏ బి జే ఎఫ్ సిర్పూర్ నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

Districts Hyderabad politics Telangana

ఆసిఫాబాద్ జిల్లా :

అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ (సిర్పూర్) నియోజకవర్గ సభ్యులతో శుక్రవారం కాగజ్ నగర్ పట్టణం లో న్యూస్ కాలనీ అంబెడ్కర్ భవనంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశం లో ABJF యూనియన్ నియోజకవర్గ కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ లో జాడి దిలీప్ కాగజ్ నగర్ ప్రెసిడెంట్ గా,జి.శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్, బి.శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ, కే. ప్రేమ్ సాగర్ ట్రేసరెర్ ,మీర్జా జలీల్ బేగ్ గౌరవ సలహా దారు , డొంగ్రి రవీందర్ జాయింట్ సెక్రటరీ, బుక్య సంతోష్ నాయక్ జాయింట్ సెక్రటరీ, డోంగ్రి తిరుపతి అసిస్టెంట్ సెక్రటరీ, జే.శ్రీనివాస్ , అర్. రవీందర్ ప్రచార కార్యదర్శి లుగా ఎన్నుకోబడ్డారు.

జర్నలిస్ట్ భద్రత , జర్నలిస్ట్ రక్షణ , జర్నలిస్ట్ సంక్షేమమే ప్రధానాంశంగా యూనియన్ పని చేస్తుందని , ఇదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రతి జిల్లాల్లో జిల్లా కమిటీ లను నిర్ణయించి యూనియన్ ను బలోపేతం చేస్తూ జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కార్యాచరణలో భాగంగా ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని జాతీయ అధ్యక్షులు రాజేష్ తెలియజేశారు, ఈ సమావేశం లో తెలంగాణ కోర్ కమిటీ రావూరి గంగాధర్ రావు, ఇ.లక్ష్మన్ చారి ,సురేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

యువతకు ఆదర్శం హైదరాబాద్ రైడర్ ప్రియా

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *