పేదలకు సేవ చేసే నాయకుడే నిజమైన ప్రజా నాయకుడు అందుకు ప్రతిరూపమే జీఎంఆర్ – మంత్రి హరీష్ రావు

Districts politics Telangana

_నిరంతరం పేద ప్రజల కోసం పరితపించే నాయకుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఎమ్మెల్యే జిఎంఆర్ పై మంత్రి హరీష్ రావు ప్రశంసల జల్లు

మనవార్తలు ,పటాన్ చెరు;

నిరంతరం పేద ప్రజల కోసం పరితపించే నాయకుడు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.మంగళవారం మధ్యాహ్నం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన ప్రభుత్వ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, ఉచిత పోలీస్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 179 ప్రభుత్వ విద్యాసంస్థల్లో అంగన్వాడి నుండి పీజీ వరకు విద్యనభ్యసిస్తున్న 37078 విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడంతోపాటు, 3114 మంది అంగన్వాడి విద్యార్థులకు వర్ణమాలతో కూడిన పలకలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు అందించడంతోపాటు, ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.అనుక్షణం అనునిత్యం పేదల అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు పటాన్ చెరు ఎమ్మెల్యేగా ఉండటం ప్రజల అదృష్టమని అన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కోటి పది లక్షల రూపాయల వ్యయంతో పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు, అంగన్వాడి విద్యార్థుల కోసం వర్ణమాలతో కూడిన పలకలు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు అండగా నిలబడాలన్న సమన్నత లక్ష్యంతో 2018లో ఉచిత పోలీసు శిక్షణ తరగతులు నిర్వహించడంతోపాటు, ఈ సంవత్సరం కూడా 410 మంది అభ్యర్థులకు 90 రోజులపాటు ఉచిత శిక్షణ అందించడం జరిగిందని తెలిపారు.ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో తీసుకొని వెళ్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *