మహబూబ్ పేట్ ,మనవార్తలు ప్రతినిధి :
అంతా రామమయం ఈ జగమంతా రామ మయం,అయోధ్య రాముని ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వాడవాడలా అయోధ్య రాముల వారి అక్షింతలు పంచే శుభ తరుణంలో ఈరోజు మక్త మహబూబ్ పేట్ గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం నుండి మేళతాళాలతో అయోధ్య రాముల వారి అక్షింతలు రామసేవక భక్త బృందాలు ఇంటింటికి తిరిగి అందజేశారు. ఈ మాహత్కార్యంలో ఆలయ కమిటీ వారు, హిందూ బంధువులు అనేకమంది మహిళలు పిల్లలు పెద్దలు రామసేవలో పాల్గొని తరించారు.
