తరలి వచ్చిన అత్యాధునిక దేశ- విదేశీ కార్లు, బైకులు- సీఆర్ పీఎఫ్ వాహనాలు ప్రత్యేక ఆకర్షణ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో, ప్రమాణ – 2025 రెండవ రోజైన శనివారం ఎలక్ట్రిఫైయింగ్ ఆటో ఎక్స్ పో- ఆటోమేనియాతో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో నగర నలు మూలల నుంచి తరలి వచ్చిన ఆటోమొబైల్ ఔత్సాహికులతో పాటు విద్యార్థులనూ ఆకర్షించింది. ఆటోమెటివ్ పరిశ్రమలో అత్యాధునిక ఆవిష్కరణలను చూడటానికి ఆసక్తిగా ఉంది.ఈ ఆటో ఎక్స్ పోకి, సెంట్రల్ రిజర్వు పోలీసు దళం (సీఆర్ పీఎఫ్) వారు ప్రదర్శించిన అత్యాధునిక సాయుధ వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ భారీ వాహనం పేలుళ్లు, ల్యాండ్ మైన్ల నుంచి కాపాడుకోగలిగే విధంగా రూపొందించారు. వజ్ర, మినీ వజ్ర వాహనాలతో కూడిన మాక్ డ్రిల్ ప్రేక్షకులను మరింత ఆకర్షించింది.
ఈ ఆటో ఎక్స్ పోను మింది. ప్రమాణ – 2025 సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులను ఉర్రూత లూగించింది. టెక్ అవగాహన ఉన్న విద్యార్థులు హ్యాకథాన్లు, సాఫ్ట్ వేర్- హార్డ్ వేర్ ప్రాజెక్టు ఎక్స్ పోలలో పాల్గొనగా, సాంస్కృతిక ఔత్సాహికులు ఆకట్టుకునే మాటలు, పొట్టి చిత్రాల పోటీలు, శాస్త్ర ప్రదర్శనలు, ఫ్రీస్టైల్ రాప్ బాటిల్స్, డీజే పోటీలలో పాల్గొన్నారు. ఇవే కాక, విద్యార్థులంతో ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, మిస్టర్ అండ్ మిసె ప్రమాణ పోటీలలో విరివిగా పాల్గొన్నారు. సినిమాటిక్ మేకప్, స్పే పెయింట్ ఆర్ట్, స్లిమ్ మేకింగ్, ఎమర్జెన్సీ ఇంపాక్ట్ వంటి వాటిలో శిక్షణ కోసం ఈ సందర్భంగా పలు ఆకర్షణీయమైన కార్యశాలలు నిర్వహించారు.
ప్రమాణ రెండో రోజు, అత్యుత్తమ క్షణాలలో ఒకటిగా నిలిచిన 9టీన్, వర్ణం బ్యాండ్ ల హై-ఎనర్జీ ప్రదర్శన విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇక ఆత్మవిశ్వాసం, గాంభీర్యం, ఆకర్షణలను ప్రదర్శించే అద్భుతమైన ర్యాంప్ వాక్, వేదిక అంటే సహజంగా ఉండే భయాన్ని పోగొట్టడంలో తోడ్పడడమే గాక, ఉత్సాహభరితమైన జనసమూహం ముందు విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించేలా ప్రోత్సహించింది.ఈ వేడుకలు మూడో రోజైన ఆదివారం నిర్వహించే ప్రపంచ ప్రసిద్ధ జూలియా బ్లిస్, పీఆర్ వో బ్రదర్స్ యొక్క అద్భుతమైన ఈడీఎం-డీజే నైట్ తో ముగియనుంది.