పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
రానున్న రోజుల్లో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దబోతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టడీ టూర్ లో భాగంగా బుధవారం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని యశ్వంత్పుర్, చిక్బల్లాపూర్ మార్కెట్ యాడలను ఎమ్మెల్యే జిఎంఆర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం ఆయా మార్కెట్ కమిటీల అధికారులతో సమావేశమై క్రయ విక్రయాలు, దుకాణాల కేటాయింపులు, వ్యాపార నిర్మాణ అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అతి కొద్ది కాలంలోనే ఏటా ఆరు కోట్ల టర్నోవర్ స్థాయికి చేరుకోవడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలోనే మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.