Telangana

గీతమ్ ను సందర్శించిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ బృందం…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఇద్దరు సభ్యులతో కూడిన అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ఏఎసియూ) ప్రతినిధి బృందం శుక్రవారం హెదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఈ ద్విసభ్య ప్రతినిధి బృందంలో ఏఎసీయూలోని డబ్ల్యూపీ కారీ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్లినికల్ అసోసియేట్ ప్రొఫెసర్ బ్రెట్ డ్వార్జే, అంతర్జాతీయ విద్యార్థులు, స్కాలర్ల కేంద్రం అసోసియేట్ వెస్ట్ ప్రెసిడెంట్ హోలీ సింగ్ ఉన్నారు.ఈ ఇరువురూ గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్లోని వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించారు. పరస్పరం సహాయ సహకారాలు అందించుకోగల ప్రాంతాలు, ముఖ్యంగా శిక్షణ, పరిశోధనా సహకారం, గీతం విద్యార్థులకు ఫీజులో మినహాయింపు వంటి అంశాలపై ప్రాథమికంగా చర్చించారు.ఆ తరువాత అరిజోనా బృందం గీతం విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో, డాక్టర్ బ్రెట్ డ్వార్జే ‘బిజినెస్ అనలిటిక్స్ అండ్ ద రోల్ ఆఫ్ ది డెసిషన్ సెంటిస్ట్’ అనే అంశంపై ప్రసంగించారు.

విద్యార్థులు కేవలం డేటా సెంటిస్టులుగా మాత్రమే కాకుండా కార్యనిర్వాహక శాస్త్రవేత్తలు (డెసిషన్ సెంటిస్ట్)గా ఎదగాలని ఆయన అభిలషించారు. డబ్ల్యూపీ కేరీ స్కూల్ గురించి, అది నిర్వహిస్తున్న కోర్సులు వివరాలను ఆయన తెలియజేశారు. గీతం విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ, తమ బీ-స్కూల్లో ప్రవేశం పొందడానికి ఎటువంటి పని అనుభవం అవసరం లేదని, 15 ఏళ్లు భారత్లో విద్యాభ్యాసం చేసిన ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆవిష్కరణల్లో ఏఎస్యూ అమెరికాలోనే తొలి స్థానంలో నిలిచిందని, సప్లయ్ చెన్డ్ విభాగం ద్వితీయ స్థానం సాధించినట్టు డాక్టర్ బ్రెట్ సగర్వంగా ప్రకటించారు.అరిజోనా స్టే వర్సిటీలో ప్రస్తుతం దాదాపు 12 వేల మంది అంతర్జాతీయ విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారని, అందులో దాదాపు 6,600 మంది భారతీయులని హోలీ సింగ్ వివరించారు. భారతీయ విద్యార్థులలో రెండు వేల మంది సీఎస్ఈ, వెయ్యేసి మంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఐటీలను అభ్యసిస్తున్నట్టు ఆయన తెలిపారు. దాదాపు 1300 మంది భారతీయ యూజీ విద్యార్థులలో 95 శాతం మంది సీఎస్సీ చదువుతున్నారన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago