మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనిగచ్చిబౌలి డివిజన్ లో గల దేవాలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య ను కోరుతూ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు గచ్చిబౌలి డివిజన్ లోని పలు ప్రాంతాల్లో గల దేవాలయాల వద్ద భోనాలతో తమ మొక్కులు చెల్లించుకొనున్న నేపథ్యంలో అన్ని దేవాలయాల వద్ద గుంతలు పూడ్చివేసి, పారిశ్యుద్ద పనులు నిర్వహించాలని కోరారు. అలాగే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా లైటింగ్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
