ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ పాత్రపై గీతంలో చర్చాగోష్ఠి

Telangana

పాల్గొన్న ప్రముఖ వక్తలు ప్రొఫెసర్ జెరోమ్ లాకోర్, డాక్టర్ చంద్రశేఖర్,

డాక్టర్ ప్రదీప్ కుమార్, ప్రొఫెసర్ శ్రీనివాసరావు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘వైద్య పదార్థాలు: సేంద్రీయ రసాయన శాస్త్ర పాత్ర’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన చర్చాగోష్ఠిలో దేశ, విదేశీ ప్రముఖ వక్తలు పాల్గొన్నారు. వారకా సైంటిఫిక్స్ సహ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, స్విట్జర్లాండ్ లోని జెనీవా విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ జెరోమ్ లాకోర్, డీఎస్టీ-సెర్చ్ పూర్వ కార్యదర్శి, జేసీ బోస్ నేషనల్ ఫెలో డాక్టర్ ఎస్. చంద్రశేఖర్, మోరెపెన్ ప్రొప్రైటరీ డ్రగ్ రీసెర్చ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కుమార్ సస్మల్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వై. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఔషధ పురోగతికి పునాదిగా ఎలా పనిచేస్తుండనే దానిపై వారు లోతైన అవగాహనను కల్పించారు.వైద్యంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాథమిక పాత్రను, కొత్త ఔషధాలను రూపొందించడంలో, సంశ్లేషణ చేయడంలో దాని ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు. ఔషధ సమ్మేళనాలలో అధిక భాగం ప్రకృతిలో సేంద్రీయంగా ఉన్నాయని, శాస్త్రవేత్తలు లక్ష చికిత్సా ప్రభావాలను సాధించడానికి పరమాణు నిర్మాణాలను చక్కగా ట్యూన్ చేయడానికి వీలు కల్పిస్తుందని వారు స్పష్టీకరించారు.

రసాయన నిర్మాణం, జీవ కార్యకలాపాల మధ్య సంక్లిష్ట సంబంధాన్ని కూడా పరిశీలించడంతో పాటు. ఈ అవగాహన వివిధ వ్యాధులకు వినూత్న ఔషధాల అభివృద్ధిని ఎలా సాధ్యం చేస్తుందో విశదీకరించారు.ఔషధ ఆవిష్కరణలో సేంద్రీయ రసాయన శాస్త్రం అనివార్య పాత్ర ఈ చర్చాగోష్ఠిలోని ఒక ముఖ్యమైన విషయం. ఔషధ ఆవిష్కరణను నడిపించే అధునాతన సింథటిక్ పద్ధతులపై నిపుణులు వివరించారు. రెట్రోసింథటిక్ విశ్లేషణ వంటి పద్దతులు సేంద్రీయ రసాయన శాస్త్రవేత్తలకు జీవ లక్ష్యాలతో సమర్థవంతంగా సంకర్షణ చెందే నూతన అణువులను రూపొందించడానికి, సంశ్లేషణ చేయడానికి తోడ్పడడంతో పాటు, సంచనాత్మక ఔషధాల సృష్టికి దారితీస్తాయన్నారు.అంతే కాకుండా, సేంద్రీయ రసాయన శాస్త్రం ఔషధ శాస్త్రానికి వెన్నెముక అని, ఇది ఔషధ సంశ్లేషణ, సూత్రీకరణ, డెలివరీని ప్రభావితం చేస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు.

సేంద్రీయ అణువుల సంక్లిష్టతలను, వాటి ప్రతిచర్యాత్మకతను అర్థం చేసుకోవడం ద్వారా, పరిశోధకులు బాధలను తగ్గించే, జీవిన నాణ్యతను పెంచే ప్రాణాలను రక్షించే మందులను అభివృద్ధి చేస్తూనే ఉన్నట్టు వారు తెలిపారు. వైద్య పురోగతికి మూలస్తంగా సేంద్రీయ రసాయన శాస్త్రం ప్రాముఖ్యతను ఈ చర్చాగోష్ఠి పునరుద్ఘాటించింది. ఇది ఆరోగ్య సంరక్షణలో భవిష్యత్ పురోగతులకు మార్గం సుగమం చేస్తోంది.తొలుత, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రెజా అతిథులను స్వాగతించి, సత్కరించారు. కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ రాంబాబు గుండ్ల, డాక్టర్ పూర్ణచంద్రరావు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ, వక్తలకు, ఆర్థిక సౌజన్యం అందించిన స్పాన్సర్ల కు వారు కృతజ్ఙతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *