పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పేదలకు వైద్యం అందించడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆపత్కాలంలో ఆపన్న హస్తంల ఆదుకుంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీశైలం, రుద్రారం మాజీ ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి, ముత్తంగి అశోక్, మధుసూదన్,పాండు యాదవ్, యాదయ్య,ch వెంకటేష్, ప్రభు, కిట్టు ,రాఘవేంద్ర, మహేష్, గోపాల్, శ్రీనివాస్,అనిల్, గణేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు