మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
రాబోయే రోజుల్లో శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేస్తామని కాంగ్రెస్ పర్5 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జెరిపేటి జైపాల్ ను మంగళవారం రోజు శేరిలింగంపల్లిలోని జేబీఎన్ గార్డెన్లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జెరిపేటి జైపాల్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేసిన జైపాల్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమించడం వల్ల అధిష్టాన వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ జైపాల్ పనితీరుకు తగిన ఫలితం దక్కిందని అభిప్రాయపడ్డారు.
జైపాల్ మాట్లాడుతూ కార్యకర్తల అండతో పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తానని కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటూ వారికున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. నా మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకంతో ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లి కన్వీనర్ రఘునందన్ రెడ్డి, యూత్ నాయకులు జెర్రిపేటి రామచందర్ రాజు, రంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ భరత్ కుమార్ రేణుక అలీ నిజముద్దీన్ సీనియర్ నాయకులు కే నరసింహ గౌడ్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు సురేష్ నాయక్, ఎస్టీ సెల్ సూర్య రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.