త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు….

Hyderabad Telangana

త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు….

అమీన్ పూర్:

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా శనివారం మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డు లింగమయ్య కాలనీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా 20 లక్షల రూపాయలతో నిర్మించిన తలపెట్టిన అంగన్వాడి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ…. 24 వార్డులలో అతిపెద్ద మున్సిపాలిటీగా ఏర్పడిన అమీన్పూర్ పరిధిలో ప్రభుత్వ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్న మాట వాస్తవమేనని, అతి త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన రక్షిత మంచి నీరు అందేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మూడు ఎకరాల్లో మినీ స్టేడియం, రాక్ గార్డెన్, పోలీస్ స్టేషన్ కోసం పక్కా భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బీరంగూడ గుట్టపై ప్రభుత్వ కార్యాలయాల భవనాల కోసం పది ఎకరాల కేటాయించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు కృష్ణ, కొల్లూరు మల్లేష్, గోపాల్, మల్లేష్, యూసుఫ్, బిజిలి రాజు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *