మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ డిమాండ్ చేశారు . ప్రత్యేక డివిజన్ సాధన కై అన్ని పార్టీల నాయకులు కలిసి చేస్తున్న రెండవ రోజు దీక్ష శిభిరాన్ని మెట్టుశ్రీధర్ సందర్శించి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు . ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ కోసమే 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామపంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని అభివృద్ది పేరుతో గ్రామలను మున్సిపాల్టీలలో విలీనం చేసి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి పరిపాలన వ్యవస్థను తీసుకురావల్సిందిపోయీ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మెట్టుశ్రీధర్ అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి విలీన గ్రామప్రజలకు చేరువలో ఉన్న కిష్టారెడ్డిపేట కేంద్రంగా జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలని మెట్టుశ్రీధర్ కోరడం డిమాండ్ చేశారు .
