_జిహెచ్ఎంసి డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
జిహెచ్ఎంసి పరిధిలోని పటాన్ చెరు, భారతి నగర్, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సత్వరమే నిధులు కేటాయించాలని బల్దియ కమిషనర్ లోకేష్ కుమార్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.డివిజన్లో అభివృద్ధికి నిధుల కేటాయింపు అంశంపై ఇటీవల రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ నేతృత్వంలోని కార్పొరేటర్ల బృందం సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం హైదరాబాదులోని బల్దియా కార్యాలయంలో కమిషనర్ లోకేష్ కుమార్ తో సమావేశమయ్యారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పడుతున్న కాలనీలలో మౌలిక వసతుల నిధులు, కేటాయించడంతోపాటు, పటాన్ చెరు ఫుట్ ఓవర్ బ్రిడ్జి , వరద నీటి కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే త్వరితగతిన పనులు చేపడతామని ఆయన తెలిపారు.