సెమికండక్టర్ పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు

politics Telangana

_గీతం చర్చాగోష్ఠిలో ముఖ్య అతిథి నరేంద్ర కొర్లెపారా

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సెమీకండక్టర్ పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, 2030 నాటికి మార్కెట్ విలువ 3.1 ట్రిలియన్ డాలర్లకు పెరగనుందని సినాప్సిస్ సీనియర్ డైరక్టర్ , సెట్ లీడర్ నరేంద్ర కొర్లిపారా చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని జీ-ఎలక్ట్రా, ది ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) విద్యార్థి విభాగం సంయుక్తంగా ‘భారత – సాంకేతిక దశాబ్దం (“India’s Techade – Chips for Vikasit Bharat’) అనే అంశంపై బుధవారం నిర్వహించిన ఒక రోజు చర్చాగోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, గీతమ్ లోని ఈఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన సెమీకండక్టర్. ఎకోసిస్టమ్, సాఫ్ట్ వేర్ , చిప్స్ ద్వారా నడపబడుతోంది’ అనే అంశంపై ప్రసంగించారు. రానున్న దశాబ్ద కాలంలో అన్ని ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మార్కెట్ కలిసి సుమారు 5 నుంచి 10 ట్రిలియన్ డాలర్లు ఉండొచ్చని నరేంద్ర అంచనా నేశారు. ప్రతిదీ డిజిటల్ ఎనేబుల్ చేయబడిందని, మనం తాకే, అనుభూతి చెందే, ఉపయోగించే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువూ సెమీకండక్టర్ పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయన్నారు. పరిశ్రమకు అవసరమైన ప్రతిభ గల విద్యార్థులను ఉత్పత్తి చేయడంలో విద్యా సంస్థల ప్రాముఖ్యతను ఆయన ఎత్తిచూపారు.

వర్ధమాన ఇంజనీర్లు ఈసీఈ, ట్రిబుల్ ఈ, మెకానికల్ వంటి కోర్ ఇంజనీరింగ్ పై దృష్టి సారించాలని, నుంచి భావ ప్రకటనా నైపుణ్యాలను అలవరచుకోవాలని హితబోధ చేశారు. సభాధ్యక్షత వహించిన గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరక్టర్ ప్రొఫెసర్ వీ. ఆర్. శాస్త్రి మాట్లాడుతూ, సెమీకండక్టర్ పరిశ్రమపై మనదేశం లక్షల కోట్లను వెచ్చిస్తోందని, చిప్ తయారీ, రూపకల్పన కోసం దేశాన్ని గ్లోబల్ హబ్ గా మార్చే మిషన్ లో చురుకుగా పాల్గొనాలని విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని అంతా వీక్షించడంతో పాటు ఏఎండీ సీనియర్ సిలికాన్ డిజెన్ ఇంజనీర్ ఆయుష్ శర్మతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. బెంగళూరులోని పైటేక్ , ఎంబెడెడ్ బృందంతో ఆన్లైన్ ముఖాముఖిలో ‘ఎంటెడెడ్ డిజెన్ సర్వీసెస్ అనుభవాలు’, పరిశ్రమకు యువ ఇంజనీర్ల ఆవశ్యకతపై చర్చించారు.తొలుత, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. మాధని సెమినార్ లక్ష్యాన్ని వివరించగా, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ సి.శ్రీనివాస్ వందన సమర్పణతో ఈ చర్చాగోష్టి కార్యక్రమం ముగిసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *