మనవార్తలు ,పటాన్ చెరు
బాలికల విద్య కోసం తన వంతు సాయంగా పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామo లో గ్రామ పంచాయతీ అటెండర్ చెరుకుపల్లి రాములు కుమార్తె చదువు కోసం ఆర్థిక సహాయం అందించారు . రుద్రారం యువసేన సభ్యులు గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి చేతుల మీదుగా పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు వంశీ మరియు నీలం మధు ముదిరాజ్ యువసేన సభ్యులు సతీష్ ,గణేష్ ,మహేష్, కార్తీక్, రమేష్, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు