క్రిస్మస్ వేడుకల ప్రారంభ సూచికగా ‘మెర్రీ మిక్సింగ్’…

Telangana
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లో ‘మెర్రీ మిక్సింగ్’ పేరిట వినోధభరితమైన కేక్ మేకింగ్ కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. క్రిస్మస్ ఆనందాన్ని పంచేందుకు వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఆహ్వానిస్తూ ఆతిథ్య (హాస్పిటాలిటీ) విభాగం ఈ వేడుకను నిర్వహిస్తోంది.క్రిస్మస్ సీజన్ సమీపిస్తున్నందున, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రుచికరమైన స్నాక్స్, ట్రీట్లతో జరుపుకోవడాన్ని గీతం ప్రోత్సహిస్తోంది. వర్ధమాన ఇంజనీర్లు, మేనేజర్లు, శాస్త్రవేత్తలు, ఫార్మసిస్టులు, ఆర్కిటెక్ట్లు, ఇతర విభాగాల విద్యార్థులను ఒకచోట చేర్చడం లక్ష్యంగా ఈ కేక్ మిక్సింగ్ వేడుకలను నిర్వహిస్తున్నారు.’మెర్రీ మిక్సింగ్’ వేడుకను నిర్వహించడాన్ని, పండుగ సీజన్ను ఉత్సాహభరితం చేయడానికి సంతోషిస్తున్నట్టు ఆతిథ్య విభాగం డిప్యూటీ డెరైక్టర్ అంబికా ఫిలిప్ తెలిపారు. ఈ వేడుక తమ ప్రాంగణంలో ఆనందం, ఉత్సాహాన్ని నింపడమే గాక తమ విద్యార్థుల మధ్య ఐక్యత, వేడుకల భావాన్ని పెంపొందిస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు.మెర్రీ మిక్సింగ్’ వేడుక కోసం విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా చూడడమే కాక, ఇందులో పాల్గొనమని తమ తోటివారిని కూడా ప్రోత్సహిస్తున్నట్టు అంబిక తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *