లిబరల్ ఎడ్యుకేషన్ ద్వారా బహుముఖ ప్రజ్ఞుర్ డిఆర్ పి

Telangana
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా, విద్యార్థులలో అంతర్ విభాగ నెపుణ్యాలను (బహుముఖ ప్రజ్ఞ) పెంపొందించడంతో పాటు వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు లిబరల్ ఎడ్యుకేషన్ విధానాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్నట్టు ఆంగ్ల విభాగాధిపతి ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ చెప్పారు. సికింద్రాబాద్ లోని సెయింట్ మార్చ్ కాలేజి విద్యార్థులు మంగళవారం గీతం సందర్శనకు రాగా, వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో విద్యార్థులకు క్లిష్టమైన సమస్య-పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన, భావ ప్రకటనా (కమ్యూనికేషన్) నెహ్రుణ్యాలతో పాటుగా కళలు (ఆర్ట్స్), మానవీయ శాస్త్రాలు (హ్యుమానిటీస్), మేనేజ్మెంట్, సెన్స్లలోని అంతర్ విభాగ పాఠ్యాంశాలను మేజర్, మెన్హర్లగా అభ్యసించవచ్చని తెలియజేశారు.లిబరల్ ఎడ్యుకేషన్ ప్రకారం, విద్యార్థులు బీఏ, బీబీఏ, బీఎస్సీలలో దేనిలో చేరినా, మొదటి సెమిస్టర్లో అంతా ఒకేరకమైన పాఠ్యాంశాలను అభ్యసిస్తారని, రెండో సెమిస్టర్లో విద్యార్థులు కావాలనుకుంటే ఈ మూడింటిలో ఒకదాని నుంచి మరో కోర్సుకు మారవచ్చన్నారు. బీఏలో ప్రవేశం పొందినవారు అందులో నుంచి ఎక్కువ పాఠ్యాంశాలతో (60 క్రెడిట్లు) పాటు కొన్ని పాఠ్యాంశాలను (24 క్రెడిట్లు) బీబీఏ లేదా బీఎస్సీ నుంచి కూడా తీసుకోవచ్చని చెప్పారు.గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.శశికుమార్ డిగ్రీ స్థాయిలో వృత్తిపరమైన కోర్సుల ఎంపిక, ఉపాధి అవకాశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశీలించాల్సిన అంశాలగురించివివరించారు.ఎన్.శివమల్లికార్జునరావు సహకారంతో గీతం అడ్మిషన్ల విభాగాధిపతి డాక్టర్ కె.శివకుమార్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. విద్యార్థులకు హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, కామర్స్ విభాగాలతో పాటు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఇతర మౌలిక సదుపాయాలను చూపారు. ఔత్సాహిక విద్యార్థులు, వారు ఎంచుకున్న రంగాలలో రాణించడానికి అవసరమైన నెఫుణ్యాలు, జ్ఞానాన్ని పొందడానికి ఇటువంటి పర్యటనలు దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, వారితో పాటు వచ్చిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.చాలా అంశాలపై ఒక అవగాహన వచ్చిందని, తమ భవిష్యత్తు మెరుగుపరచగల కెరీర్ ను ఎంపిక చేసుకోవ డానికి ఈ పర్యటనలో పొందిన సమాచారం ఉపకరిస్తుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *