_అభివృద్ధి నినాదం మాది.. అవినీతి చరిత్ర మీది..
_ఓటు అడిగే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు
_గడపగడపకు పదేళ్ల ప్రగతిని వివరించండి..
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలో చేపట్టిన ప్రగతిని గడపగడపకు వివరించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.శుక్రవారం పటాన్చెరువు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తలు బూత్ కమిటీ నాయకులు విద్యార్థి యువత సోషల్ మీడియా విభాగం ప్రతినిధుల సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ విజయం ఎంతో కీలకమని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని, ప్రగతిని, సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి ప్రతి ఓటరు కు వివరించాల్సిన గురతర బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.దేశానికి ఆదర్శంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు, అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న సంకుచితబుద్ధితో కాంగ్రెస్ పార్టీ డబ్బులు కట్టలు పంచేందుకు సిద్ధం చేస్తోందని ఆరోపించారు. అవినీతి కాంగ్రెస్ పార్టీ, మతతత్వ బిజెపి పార్టీలకు తెలంగాణలో స్థానం లేదన్నారు. ప్రతిపక్షాలు డిపాజిట్ల కోసం పోటీ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో గొడవలు అలజడలు సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోకుండా, సంయమనముతో మెలగాలని కోరారు.
శాసనమడిది మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నుముకని, ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి తోడ్పాటు అందించాలని కోరారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.