– తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన గ్రామస్తుడు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామం సర్వేనెంబర్ 369 /రు/1/1, 2లలో 1 ఎకరా 30 గుంటలు ఉన్న అసైన్డ్ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని గ్రామస్తుడు షఫీ ఆరోపించాడు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గురువారం తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అసైన్డ్ భూమిని అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ఆయన ఆరోపించాడు. దీనిపై స్థానిక అధికారులు అడిగితే కలెక్టర్ కార్యాలయం నుంచి లేఖ తెచ్చుకున్నారని చెబుతున్నారని అయితే ఆలేఖ మాత్రం చూపడం లేదని ఆరోపించారు. దీని పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు.