పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మనదేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాద్” దేశవ్యాప్త సరిశుభ్రత కార్యక్రమంలో ఆదివారం హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. గీతమ్లోని ఎన్ఎసీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది సహకారంతో అక్టోబర్ 15, ఉదయం 10-11 గంటల వరకు విశ్వవిద్యాలయ పరిసరాలతో పాటు రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని కూడా శుభ్రపరిచారు.
మహాత్మాగాంధీ జయంతికి ఒకరోజు ముందు, ఆయనకు నివాళులర్పించే లక్ష్యంతో, స్వచ్చత కోసంఅన్నివర్గాల పౌరులు స్వచ్చందంగా కృషిచేయాలని ప్రధాని ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, గ్రామ సర్పంచ్ పి.సుధీర్‌రెడ్డి, ఉపసర్పంచ్ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి రాణికుమార్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ఎంపీ హరిశంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఎన్సీసీ ఆఫీసర్ శంకర్, పాఠశాలలోని ఎసీసీసీ క్యాడెట్లు చురుగ్గా పాల్గొన్నారు.

ఈ సమష్టి కృషి ద్వారా, పరిశుభ్రత ప్రాముఖ్యతను నొక్కి చెప్పడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని. నిర్వహించడం పట్ల ప్రతి వ్యక్తిలో బాధ్యతాయుత ఛానాన్ని కలిగించడాన్ని గీతం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పాల్గొన్న వారంతా పరిశుభ్రత కోసం తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
