పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) ఇ-కామర్స్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని ఆఫ్జినెస్ ప్రాంతీయ అధిపతి మోహిత్ చౌధురి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ (జీఎస్ హెచ్) విద్యార్థులతో.. శుక్రవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు తమ అవసరాల సేకరణ కోసం బీ2బీ మార్కెట్ ప్లేస్లలోకి ప్రవేశిస్తున్న ధోరణిని ఆయన వివరించారు. భారత స్ట్ బీ మార్కెటిస్లు 2030 వాటికి 200 బిలియన్ల డాలర్ల విలువెన మార్కెట్ అవకాశాన్ని చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.బీ2బీ పరిశ్రమలోని ఆశాజనక కెరీర్ అవకాశాల గురించి విలువైన అంతర్గత అంశాలను ఆయన వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై దృష్టి సారించే ప్రముఖ భారతీయ స్టార్టప్ ఆఫ్ బిజినెస్ అన్ని ముడిపదార్థాల సేకరణను సులభతరం చేయడానికి, ఎంఎస్ ఎంఈలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ఉద్దేశిందన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు విలువను పెంచడానికి నిధులను కేటాయించినట్టు చెప్పారు.
గీతమ్ మేనేజ్మెంట్ విద్యనభ్యసిస్తున్న ఔత్సాహిక మేనేజర్లు లింగ్డన్లో తను బయోడేటాను పాండు. పరచాలని మోహిత్ సూచించారు. బీబీ పరిశ్రమలో ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్న సృష్టించడానికి ఇది ఉపకరిస్తుందని, అందులో పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారు తమ బయోడేటాను earlyareers (@ofbusiness.in మెయిల్కు పంపించాలని చెప్పారు. విద్యార్థులను ప్రశ్నించి, వారినుంచి జవాబులు రాబడుతూ అద్యంతం ఉత్సాహభరితంగా ఈ ముఖాముఖి నిర్వహించారు. వారు సంధించిన పలు ప్రశ్నలకు ఆకట్టుకునే రీతిలో జవాబులిచ్చారు.